: ఒక్కసారేంటి?... వందసార్లు క్షమాపణ చెప్పేందుకు అభ్యంతరం లేదు: రేవంత్ రెడ్డి


‘‘పొరపాటు చేస్తే ఒక్కసారంటి? వందసార్లు కూడా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే, పాలక పక్షం రాజకీయ కక్షలతో టీ టీడీపీపై చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలి’’ అని టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ గీతానికి అవమానం నేపథ్యంలో అధికార పక్షంతో వాదనకు దిగి సస్పెన్షన్ కు గురైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆయన టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలను గుప్పించారు. సభలో ఓ వైపు రికార్డైన వీడియో ఫుటేజీలను మాత్రమే ఫ్లోర్ లీడర్ల భేటీలో ఉంచిన ప్రభుత్వం, మరోవైపు నుంచి నమోదైన వీడియో ఫుటేజీలను ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News