: సంగక్కరను చూసి భయపడుతున్నారు: ముత్తయ్య మురళీధరన్


వరుసగా మూడు వరల్డ్ కప్ మ్యాచ్ లలో సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన కుమార సంగక్కరను చూసి ఇతర టీంలు భయపడుతున్నాయని శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యానించాడు. సంగక్కర రూపంలో వన్ డే క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ ను లంక కలిగివుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెబ్ సైట్ కు రాసిన కాలమ్ లో ఆయన అభిప్రాయపడ్డాడు. "మీరు విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లేదా మాక్స్ వెల్ గురించి మాట్లాడుకోవచ్చు. వీరంతా ప్రస్తుత టోర్నమెంట్లో అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, వీరందరి కన్నా సంగక్కరను చూసి అన్ని టీంలు భయపడతాయి" అని మురళీధరన్ అన్నాడు. పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఎదుర్కొన్న బంతుల కంటే అధికంగా పరుగులు సాధించడం అభినందనీయమని పేర్కొన్నాడు. తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సంగా కప్ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని ఈ లెజెండరీ స్పిన్నర్ చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సంగక్కర రాణించినప్పటికీ లంక ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News