: ఆలం విడుదలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందే: ఖర్గే
పార్లమెంటు సమావేశాల్లో నేడు వాడీవేడి వాతావరణం చోటుచేసుకుంది. కాశ్మీర్ వేర్పాటు వాద నేత మసరత్ ఆలం విడుదలపై ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందేనని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లోక్ సభలో పట్టుబట్టారు. ఆలం వంటి దేశ ద్రోహులను స్వేచ్ఛగా వదిలేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఖర్గే డిమాండ్ పై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ... ఆలం విడుదల వ్యవహారంపై మధ్యాహ్నం జవాబిస్తామని ప్రకటించినా, విపక్షాలు శాంతించలేదు. ప్రధాని జవాబివ్వాలని పట్టుబట్టాయి.