: సెంచరీ దిశగా మహ్మదుల్లా... బంగ్లాదేశ్ 197/4
ఇంగ్లండుతో మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ మహ్మదుల్లా (91 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ముష్ఫికర్ రహీం (53 బ్యాటింగ్) కూడా రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. అడిలైడ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 8 పరుగులకే ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (2), ఇమ్రుల్ కయీస్ (2)ల వికెట్లు కోల్పోయింది. వీరిద్దరూ ఆండర్సన్ ఖాతాలో చేరారు. స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ (2) నిరాశపరిచినా, సౌమ్యా సర్కార్ (40) రాణించాడు.