: తెలంగాణ బడ్జెట్ సమావేశాల నుంచి 10 మంది టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నుంచి టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సహా పది మంది సభ్యులు సస్పెండయ్యారు. వీరిలో ఎర్రబెల్లి, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, రాజేందర్ రెడ్డి, సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్, వివేక్ లున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గొడవలో జాతీయ గీతాన్ని అవమానపరిచేలా బెంచీలెక్కి నిరసన తెలిపిన సభ్యులు క్షమాపణ చెప్పాలన్న మంత్రి హరీశ్ రావు డిమాండ్ ను టీ టీడీపీ తిరస్కరించింది. అంతేగాక, సభా కార్యక్రమాలను అడ్డుకుంది. దీంతో, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో హరీశ్ రావు ప్రతిపాదన మేరకు పది మంది టీ టీడీపీ సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాలు ముగిసే దాకా కొనసాగుతుందని స్పీకర్ పేర్కొన్నారు.