: సత్యం కేసులో తీర్పు ఏప్రిల్ 9కి వాయిదా


సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో తీర్పును నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదావేసింది. తుది తీర్పును ఏప్రిల్ 9న వెలువరించనున్నట్టు పేర్కొంది. ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువరిస్తారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. సోమవారం నాడు రామలింగరాజు భవితవ్యం తేలుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే, కోర్టు తన తీర్పును ఏప్రిల్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు రామలింగరాజు సహా నిందితులందరూ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు.

  • Loading...

More Telugu News