: ట్విట్టర్లో అడుగుపెట్టిన తమిళ'సింగం'
ఇటీవల సినిమా తారలు సోషల్ మీడియాను మాగ్జిమమ్ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఉపయుక్తమని భావిస్తున్న తారలు ఖాతాలు తెరిచి సినీ, వ్యక్తిగత వివరాలు పంచుకుంటున్నారు. తాజాగా, తమిళ హీరో సూర్యా కూడా ట్విట్టర్లో అడుగుపెట్టాడు. ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నానన్న ఉద్విగ్నతతో సరిగా నిద్ర కూడా పట్టలేదని సూర్యా ట్వీట్ చేశాడు. ట్విట్టర్ తనకు పూర్తిగా కొత్త అని పేర్కొన్నాడు. తనను అభిమానిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.