: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, డీఎస్పీ మధ్య వాగ్యుద్ధం... ఎస్పీకి ఫిర్యాదు


నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ డీఎస్పీ రాములు నాయక్‌ ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. తమ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు వీరేశం తన అనుచరులతో కలసి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులను డీఎస్పీ కార్యాలయంలోకి అనుమతిస్తామని పోలీసులు వెల్లడించడంతో గొడవ మొదలైంది. దీన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నిరసనకు దిగింది. కార్యకర్తలను అనుమతించే విషయమై వాగ్వివాదం ముదరగా, ఎమ్మెల్యే, డీఎస్పీ పరస్పరం దూషించుకున్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యే నల్గొండ ఎస్పీని కలిశారు. తనపట్ల డీఎస్పీ దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News