: మాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి... గన్ పార్క్ వద్ద టి.టీడీపీ ధర్నా


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా తమపై దాడికి దిగిన టీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. కొద్దిసేపటి క్రితం గన్ పార్క్ వద్ద ధర్నా ప్రారంభించిన టి.టీడీపీ నేతలు, దాడి చేసిన అధికార పార్టీ సభ్యులను తక్షణమే సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, తమ పార్టీ టికెట్లపై గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన వారి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ధర్నా నేపథ్యంలో స్పీకర్ నిర్వహిస్తున్న ఫ్లోర్ లీడర్ల భేటీకి టి.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News