: ఏడు నెలల గర్భంతో 5 కిలోమీటర్ల పరుగు


గర్భం దాల్చిన తరువాత ప్రసవం అయ్యే వరకూ ప్రతి రోజూ వ్యాయామం చేయాలన్న సూచనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 42 సంవత్సరాల గర్భిణి '5కే రన్'లో పాల్గొంది. ఏడు నెలల గర్భిణిగా వున్న కామారపు లక్ష్మి కరీంనగర్‌ లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 5 కే రన్ లో పాల్గొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. స్థానిక ఉజ్వల పార్క్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల దూరం ఉత్సాహంగా పరుగు తీసిన ఆమె, డ్యాం వద్ద దాదాపు 80 మెట్లను చంకలో పాపను ఎత్తుకొని మరీ అలవోకగా ఎక్కింది. అంతర్జాతీయ స్థాయి పరుగు పందెం పోటీల్లో పలు పతకాలు సాధించిన భర్త రవీందర్ ప్రోత్సాహంతో తను ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News