: రఘువీరా కుమారుడి కారు బీభత్సం... శంషాబాద్ సమీపంలో ట్యాక్సీని ఢీకొట్టిన వైనం


హైదరాబాదు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కొద్దిసేపటి క్రితం ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఆ కారు ట్యాక్సీని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అయితే ట్యాక్సీని ఢీకొన్న కారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కుమారుడికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకువచ్చిన రఘువీరా కుమారుడి కారు ప్రయాణికులతో వెళుతున్న ట్యాక్సీని వెనుక నుంచి డీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News