: అక్రమ బంగారానికి అడ్డాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు... 3 కిలోల బంగారం పట్టివేత


హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమంగా తరలివస్తున్న బంగారానికి కేంద్రంగా మారింది. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దేశంలోకి తరలివస్తున్న బంగారం కేజీల కొద్ది ఇక్కడ పట్టుబడుతోంది. తాజాగా నేటి ఉదయం సోదాలు చేసిన పోలీసులు 3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాదు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద పోలీసులు ఈ బంగారాన్ని కనుగొన్నారు. సదరు ప్రయాణికుల వద్ద లభించిన బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేవు. దీంతో దానిని అక్రమ బంగారంగానే నిర్ధారించిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News