: సైనా సూపర్... ప్రదర్శన అద్భుతమంటూ కేసీఆర్ పొగడ్తలు!


ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన భారత షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. ఇక చిరకాలంగా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కూడా సైనా సొంతమైనట్టేనని సగటు భారతీయుడు భావించాడు. అందుకనుగుణంగానే నిన్న జరిగిన టైటిల్ పోరులో తొలి సెట్ లో సైనా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. భారతీయులంతా నిరాశ చెందారు. ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సైనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘టైటిల్ పోరులో ఓడినా, సైనా ప్రదర్శన అద్భుతం. ఇప్పటివరకు ఏ భారతీయ మహిళకూ సాధ్యం కానిది సైనా సాధించింది’’ అంటూ కేసీఆర్ నిన్న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News