: ‘రాజు’ గారికి ఏ శిక్ష పడేనో?... నేడే ‘సత్యం’ కేసులో తుది తీర్పు!


సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను తాత్కాలికంగా భారీగా పెంచేసిన సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజు, షేర్ మార్కెట్ ను మాయ చేశారు. 2009 జనవరి 7న ఒక్కసారిగా వాస్తవం వెలుగుచూడటంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు నిండా మునిగిపోయారు. సాఫ్ట్ వేర్ రంగాన్ని పెను కుదుపు కుదిపిన ఈ కేసులో రామలింగరాజు సహా, పలువురు అరెస్టయ్యారు. సుదీర్ఘకాలంగా ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విచారణ ముగిసినట్టు గతేడాది డిసెంబర్ 23న ప్రకటించింది. అంతేకాక 2015 మార్చి 9న తుది తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. విచారణలో భాగంగా మూడు వేల పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం 226 మంది సాక్షులను విచారించింది. కోర్టు తుది తీర్పు నేపథ్యంలో రామలింగరాజు మోసానికి ఏ విధమైన శిక్ష పడుతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News