: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష పలితాలను ఈ సాయంత్రం వెల్లడించారు. 173 మార్కులతో కందూరి సౌమ్య ఫస్ట్ ర్యాంకు సాధించింది. 169 మార్కులతో ఉల్చి జయవర్ధన్ సెకండ్ ర్యాంకు దక్కించుకున్నాడు. కేత సంధ్యకు మూడో ర్యాంకు లభించింది. పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్టుకు 13,223 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో 8,983 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాలను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ విడుదల చేశారు.