: మానవ మూత్రం ఇక ఎంతమాత్రం వేస్ట్ కాదు!


బ్రిటీష్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించారు. తక్కువ వ్యయమయ్యే కొత్త విద్యుత్ జనరేటర్ కు రూపకల్పన చేశారు. ఈ జనరేటర్ కు ఇంధనం ఏమిటో తెలుసా?... మానవమూత్రం! అవును, మనిషి మూత్రం ద్వారా ఈ జనరేటర్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చంటున్నారు పరిశోధకులు. వెస్ట్ ఇంగ్లండ్ యూనివర్శిటీ, ఆక్స్ ఫామ్ సంస్థ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి. జనరేటర్ లోని మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ లో ఇంధనంగా నింపడానికి వర్శిటీ విద్యార్థులు, సిబ్బంది తదితరుల నుంచి మూత్రం సేకరించారు. ఈ పరిశోధనల్లో విజయం సాధించిన బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది చవకైనదని, ఒక్క మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్ ఖరీదు ఒక పౌండ్ (రూ.94) మాత్రమే అని లీరో పౌలోస్ అనే పరిశోధకుడు తెలిపారు. పర్యావరణం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News