: సైనాకు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన సచిన్


భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి మహిళగా రికార్డు పుటల్లోకెక్కిన సైనా, ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్టు సచిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. టైటిల్ పోరులో సైనాకు శుభం కలగాలని ఆకాంక్షించాడు. ఈ టోర్నీ ఫైనల్లో సైనా ఆరో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఎనిమిది పర్యాయాలు పాల్గొన్న సైనా 2010, 2013లో సెమీస్ వరకు వెళ్లగలిగింది. గతేడాది క్వార్టర్స్ లోనే ఇంటిముఖం పట్టింది.

  • Loading...

More Telugu News