: చేతులు కలిపిన ఉగ్ర సంస్థలు... ఐఎస్ఐఎస్, బోకో హరామ్ మధ్య డీల్
ప్రపంచాన్ని వణికిస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇరాక్ లోని ఐఎస్ఐఎస్, నైజీరియా కేంద్రంగా సాగుతున్న బోకో హరామ్ గ్రూపుల మధ్య ఒప్పందం కుదిరినట్టు ఒక వీడియో వెల్లడిస్తోంది. ఈ కొత్త బంధంపై బోకో హరామ్ నేత అబూ బకర్ షికావు మాట్లాడిన మాటలను గ్రూప్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని ముస్లింలంతా తమతో కలసి రావాలని షికావు కోరాడు. పాశ్చాత్య విద్యాబోధన ఓ పాపమని ఆయన ఆరోపించాడు. కాగా, ఈ రెండు ఉగ్రవాద సంస్థల మైత్రిపై అమెరికా, బ్రిటన్ నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి.