: వేర్పాటువాద నేతను విడిచిపెట్టిన ముఫ్తీ ప్రభుత్వం... విమర్శల వెల్లువ
బీజేపీతో కలసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని జమ్మూకాశ్మీర్ లోని ముఫ్తీ ప్రభుత్వం మరచినట్టుంది. బారాముల్లా జైలులో వున్న కరడుగట్టిన భారత వ్యతిరేకి మసారత్ ఆలమ్ ను విడుదల చేసింది. 2010లో మసారత్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనపై మరో 17 కేసులు పెండింగ్ లో వున్నాయి. మసారత్ కు వాస్తవాధీన రేఖకు రెండువైపులా మంచి ప్రజాదరణ ఉంది. వేర్పాటువాద ఉద్యమ నేతగా ఉగ్రవాదులకు సహాయం చేశాడన్న ఆరోపణలున్న వ్యక్తిని ఎలా విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ బీజేపీ లక్ష్యంగా విరుచుకుపడింది.