: తడబడ్డ ఆస్ట్రేలియా... స్మిత్, క్లార్క్ అవుట్
భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా శ్రీలంకతో పోరు మొదలు పెట్టిన ఆస్ట్రేలియా జట్టు 30 ఓవర్ల తరువాత తడబడింది. క్రీజులో నిలదొక్కుకొని ఆడుతున్న స్మిత్, క్లార్క్ వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. 2 వికెట్లకు 175 పరుగులతో పటిష్టంగా కనిపించిన జట్టు 2 పరుగుల తేడాతో 2 వికెట్లను కోల్పోయింది. 68 బంతుల్లో 68 పరుగులు చేసిన క్లార్క్ ను మలింగ అవుట్ చేయగా, 88 బంతుల్లో 72 పరుగులు చేసిన స్మిత్ ను దిల్షాన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు.