: సెక్యూరిటీ సిబ్బందిని కొట్టి అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు


బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జూహులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లిన ఆయన అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని కొట్టారని ఆరోపణలు వచ్చాయి. పబ్ లో హిందీ పాటలు వేయాలని ఆదిత్య పంచోలీ డిమాండ్ చేయడంతో గొడవ మొదలయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం ఎక్కువై ఆయన అదుపు తప్పగా బౌన్సర్ లు అడ్డుకున్నారని, దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఓ బౌన్సర్ పై చేయి చేసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పంచోలీని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News