: ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గెలుపు
నేపియర్ మ్యాచ్ లో 187 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయినప్పటికీ టాప్ ఆర్డరులో అందరూ ఎంతో కొంత స్కోరు చేయడంతో, ఏ దశలోనూ జట్టు ఇబ్బందిపడ్డట్టు కనిపించలేదు. న్యూజిలాండ్ జట్టులో గుప్టిల్ 57, మెక్ కల్లమ్ 42, విలియమ్సన్ 33, టేలర్ 24 (నాటౌట్), ఇలియట్ 19, ఆండర్సన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ జట్టులో జాద్రాన్, నబీ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన వెట్టోరీకి 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.