: తెలంగాణకు జాక్ పాట్... ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం!
తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం రానుందా? అవుననే అంటున్నారు అధికారులు. గత 15 సంవత్సరాలుగా చెల్లించకుండా ఉన్న పలు సంస్థల బకాయిలను వసూలు చేస్తే ప్రభుత్వానికి జాక్ పాట్ తగిలినట్టేనని చెబుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దక్షిణ మధ్య రైల్వేతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు వాణిజ్య పన్నుల రూపేణా సుమారు రూ 20 వేల కోట్లు బకాయి పడ్డాయని అంచనా. సికింద్రాబాదు పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న బల్లార్ పూర్ ఇండస్ట్రీస్, ఓల్టాస్ తదితర సంస్థల నుంచి దాదాపు రూ. 12 వేల కోట్లు రావాలని అధికారులు లెక్కగట్టారు. ఈ బకాయిలపై పలు కంపెనీలు కోర్టులకు వెళ్ళడంతో, ప్రత్యేక లీగల్ విభాగం ఏర్పాటు చేసి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. చాలా సందర్భాల్లో ఈ బకాయిల వసూలు కష్టంగానే ఉంటోంది.