: మూడు నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోలు డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 10 గ్రాముల బంగారం ధర రూ. 520 తగ్గి రూ. 26,540 రూపాయలకు చేరింది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. కాగా, వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 500 పడిపోయి రూ. 36,300కు చేరింది. అంతర్జాతీయ విపణిలో సైతం బంగారం ధరలు తగ్గాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధర మరింత దిగిరావచ్చని నిపుణులు భావిస్తున్నారు.