: భారీ షాట్ ఆడబోయి బోల్తా పడ్డ మెక్ కల్లమ్
వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆఫ్ఘన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. 19 బంతుల్లో 42 పరుగులు చేసి ఊపుమీదున్న మెక్ కల్లమ్ నబీ వేసిన 6వ ఓవర్ 5వ బంతికి భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 47.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 7వ ఓవర్ ను షాపూర్ జద్రాన్ మెయిడిన్ గా వేయడం విశేషం.