: న్యూజిలాండ్ విజయ లక్ష్యం 187 పరుగులు


నేపియర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న క్రికెట్ పోటీలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 47.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ జట్టులో షేన్వారీ, జార్దాన్ లు అర్ధ సెంచరీలతో రాణించారు. మిగతావారు విఫలం కావడంతో, ఆఫ్ఘన్ జట్టు భారీ స్కోర్ చేయలేక పోయింది. ఉస్మాన్ ఘని, అఫ్సర్ లు డకౌట్ కాగా, జావేద్ అహ్మదీ 1, ముంగల్ 27, అస్గర్ 9, నబీ 6, దవ్లత్ జాద్రాన్ 1, హసన్ 16, షాపూర్ జాద్రాన్ 16 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో వెట్టోరీ 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టారు. 187 పరుగుల విజయ లక్ష్యంతో మరికాసేపట్లో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News