: కోమటి'రెడ్డి' పార్టీ మర్మమేమిటి?


ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం, తెలుగుదేశం నాయకుడు రేవంత్‌ రెడ్డి తదితరులను కలుపుకొని 'తెలంగాణ రెడ్డి సమితి' పేరిట పార్టీ పెడుతున్నామని, అన్నీ అనుకున్నట్టు జరిగితే తమ పార్టీ 30 నుంచి 40 సీట్లను గెలుచుకుంటుందని కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. నిన్న ఆయన అసెంబ్లీకి వచ్చి సభలోకి వెళ్లకుండా బయటనే గడిపారు. ఈ సందర్భంగా ఆయన సరదాగానే వ్యాఖ్యలు చేసినప్పటికీ, వాటి వెనుకనున్న మర్మమేమిటన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సమయంలో కొత్త పార్టీ ఆలోచన అంటూ రాజకీయ బాణాలు వదలడం, కోదండరాం, రేవంత్‌ లు కలిసి వస్తారని చెప్పడం వెనుక నిజానిజాలు ఏమిటన్న విషయం ఎలా వున్నా, కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ లో కలకలం రేపాయి. నిన్న మొన్నటి వరకూ పొన్నాలను వ్యతిరేకించిన కోమటిరెడ్డి ఇప్పుడు తాజాగా టీపీసీసీ చీఫ్‌ గా నియమితులైన ఉత్తమ్ కుమార్‌ రెడ్డిని సైతం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News