: మా భూములు మాకిచ్చేయండి: రాజధాని రైతులు
రాజధాని ప్రాంతంలో రైతులు కొత్త ఆందోళనకు తెరతీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనతో స్థానిక రైతుల ఆలోచనల్లో మార్పులు సంభవించినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లోని రైతులు డిప్యూటీ కలెక్టర్ ను కలిసి తమ భూములు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ చేస్తారని భయపడే తాము భూములు రాజధాని కోసం ఇచ్చేశామని వారు చెబుతున్నారు. భూసేకరణ ఉంటుందంటూ అధికారులు భయభ్రాంతులకు గురి చేయడంతో తాము చివరి రోజున ఇచ్చామని వారు చెబుతున్నారు. తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదని, వ్యవసాయం తప్ప మరింకేదీ తమకు చేతకాదని వారు స్పష్టం చేస్తున్నారు. తమ భూములు తమకి ఇవ్వాలని కోరితే అధికారులు, 'దరఖాస్తు పెట్టండి, కలెక్టర్ కి పంపిస్తాం, మంత్రులు ఒప్పుకుంటే భూములు వెనక్కి ఇస్తా'మని చెబుతున్నారని వారు వాపోయారు.