: తమ్ముడి ఆత్మీయ కౌగిలి ఆ అక్కను జబ్బు నుంచి బయటపడేసింది


తమ్ముడి ఆత్మీయ కౌగిలి ఓ అక్కను ఆరేళ్లుగా బాధిస్తున్న మహమ్మారి నుంచి రక్షించింది. ఇంగ్లండ్ లో డెవన్ లోని ఫ్లిమౌత్ ప్రాంతంలో నివసిస్తున్న కోల్ ఇమ్మన్ (16)కు విపరీతమైన తలనొప్పి పట్టుకుంది. దాని కోసం వైద్యం చేస్తే ఆమె వెన్నుముకలో ఫ్లూయిడ్లు అదనంగా చేరినట్టు గుర్తించారు. వాటిని బయటకు పంపేందుకు లుంబర్ పంక్చర్ చికిత్స చేశారు. దీంతో ఆమెకు మతిమరుపు (అమ్నీషియా) ప్రారంభమైంది. ఆరేళ్లపాటు కోల్ అమ్నీషియాతో బాధపడింది. ఏదీ గుర్తుండేది కాదు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కంటిపాపలా కాపాడుకుంటున్నారు. వైద్యులు ఎలాంటి చికిత్స చేసినా ఆమెను అమ్నీషియా నుంచి బయటికి తీసుకురాలేకపోయారు. ఇంతలో ఓ రోజు ఆమె చిన్నారి తమ్ముడు కాలెబ్ వచ్చి అక్కను గట్టిగా కౌగిలించుకున్నాడు. అంతే, సినిమాలో చూపించినట్టు ఠక్కున అమ్నీషియా పోయింది. గతంలో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు గుర్తుకువచ్చాయి. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News