: హైదరాబాదును తడిపి ముద్ద చేసిన భారీ వర్షం
హైదరాబాదు నగరాన్ని వర్షం తడిపి ముద్ద చేసింది. చంద్రాయణగుట్ట, హయత్ నగర్, చంపాపేట్, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, నాగోలు, కోఠి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, వర్షం పెద్ద ఎత్తున కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి.