: జూనియర్ సివిల్ జడ్జి నియామకాల స్క్రీనింగ్ టెస్టు రేపే
జూనియర్ సివిల్ జడ్జిల నియామకాల కోసం రేపు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నామని ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రారు తారకరామ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్ష రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుందని అన్నారు. పరీక్షను హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.