: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లో సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశించింది. వరల్డ్ కప్ సంబరాల్లో భారతీయులంతా మునిగి ఉండగా, సైనా సెమీ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై 21-13, 21-13 తేడాతో విజయం సాధించింది. దీంతో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు పుటలకెక్కింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ ను గతంలో సైనా నెహ్వాల్ కోచ్ పుల్లెల గోపీచంద్ సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో సైనా విజయం సాధిస్తే తొలి ఆల్ ఇంగ్లండ్ మహిళా ఛాంపియన్ గా రికార్డులకెక్కుతుంది. అంతే కాకుండా గురు శిష్యులు సాధించిన బ్యాడ్మింటన్ టైటిల్ గా కూడా రికార్డు పుటల్లో వారిద్దరూ చిరస్థాయిగా నిలిచిపోయేందుకు అవకాశం ఉంది.