: ఢిల్లీ బాలిక అత్యాచార కేసు నిందితుడి అరెస్టు
ఢిల్లీలో తాజాగా వెలుగుచూసిన ఐదేళ్ల చిన్నారి అత్యాచార సంఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, బీహార్ లోని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం అక్కడి ముజఫర్ పూర్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తే ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించి, ఈ తెల్లవారుజామున అతనిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితుడిని దేశ రాజధానికి తరలించారు.