: లైవ్ స్ట్రీమింగ్ ను కొనుగోలు చేసే యోచనలో ట్విట్టర్
సామాజిక అనుసంధాన వేదికలు ట్విటర్, ఫేస్ బుక్ లు రోజురోజుకీ తమ సామర్థ్యం పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలో వివిధ సర్వీసులు అందిస్తున్న సంస్థలను కొనుగోలు చేసి విలీనం చేసుకుంటున్నాయి. ట్విట్టర్ 100 మిలియన్ డాలర్లు వెచ్చించి లైవ్ స్ట్రీమింగ్ యాప్ పేరిస్కోప్ ను కొనుగోలు చేసే యత్నాలు ఆరంభించింది. పేరిస్కోప్ లో లైవ్ వీడియోలను ఎక్కడి నుంచైనా అప్ లోడ్ చేయవచ్చు. రియల్ టైమ్ షేరింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా ట్విట్టర్ వినియోగదారులకు దగ్గరవ్వాలని భావిస్తోంది.