: టేలర్ సెంచరీ, విలియమ్స్ హాఫ్ సెంచరీ... భారీ స్కోరుకు దగ్గరవుతున్న జింబాబ్వే
ఐర్లాండ్ తో జరుగుతున్న క్రికెట్ పోటీలో 332 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిదానంగా లక్ష్యం దిశగా సాగుతోంది. 91 బంతుల్లో 121 పరుగులు చేసిన సెంచరీ వీరుడు బ్రెండన్ టేలర్ కుసాక్ బౌలింగ్ లో పెవిలియన్ దారి పట్టగా, విలియమ్స్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చే బాధ్యతను మోస్తున్నాడు. టేలర్, విలియమ్స్ కలసి ఐదో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం జింబాబ్వే స్కోర్ 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు.