: మహిళలను కించపరుస్తారా? అంటూ... నిర్భయ డిఫెన్స్ లాయర్లకు షోకాజ్ నోటీసులు
నిర్భయ ఘటనపై న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్భయ ఉదంతంపై ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్ రూపొందించిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీలో ఢిఫెన్సు లాయర్లు మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది. కాగా, నిర్భయ ఉదంతం, మహిళలపై నిందితుడు ముఖేష్ కుమార్, న్యాయవాదులు మాట్లాడుతూ... మహిళలు సాయంత్రాలు బయట తిరగాల్సిన పని ఏంటని, ఎవరితోనైనా బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని, చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. మహిళల స్వేచ్ఛపై నిషేధం, ఆంక్షలు ఎందుకని, మహిళల్ని మనుషులుగా గుర్తించడం అవసరమని సమాజంలోని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.