: ఆంధ్రా బ్రాహ్మణుల వెంట ఎందుకు పడుతున్నావు?: కేసీఆర్ పై ధ్వజమెత్తిన రేవంత్
గతంలో ఆంధ్రా ప్రాంత బ్రాహ్మణుల కన్నా తెలంగాణ ప్రాంతంలోని బ్రాహ్మణులు మడి, ఆచారాలను అధికంగా పాటిస్తారని వ్యాఖ్యానించి, ఇప్పుడు ఆంధ్రా ప్రాంత బ్రాహ్మణుడి వెంట ఎందుకు పరుగులు పెడుతున్నావని ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చిన్నజీయర్ స్వామి సలహాలు ఎందుకు అవసరమయ్యాయని రేవంత్ ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించిన జీయర్ స్వామినీ రేవంత్ కడిగేశారు. ఆయనో కరుడుగట్టిన రాజకీయ నేతలా మాట్లాడారని, ఇక టీఆర్ఎస్ పార్టీలో చేరి, రాజకీయ సేవలు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ 'జాతిపిత' అయితే ప్రొఫెసర్ జయశంకర్ ను ఏమని పిలవాలో చెప్పాలని స్వామీజీని డిమాండ్ చేశారు.