: డివిలియర్స్ అవుట్... సౌతాఫ్రికా ఓటమి
దక్షిణాఫ్రికా జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించింది. 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టులో ఒక్క డివిలియర్స్ మినహా మరెవరూ రాణించక పోవడంతో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టు 33.3 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్ డీ/ఎల్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ బిలో 6 పాయింట్లతో నిలిచి క్వార్టర్ ఫైనల్స్ అవకాశాలు మెరుగుపరచుకుంది. అంతకుముందు డివిలియర్స్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సొహైల్ ఖాన్ బౌలింగ్ లో 9వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. పాక్ జట్టులో 49 పరుగులు చేసి, ఆరు క్యాచ్ లు పట్టిన సర్ఫరాజ్ అహ్మద్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.