: ఆసుపత్రి నుంచి సోనమ్ కపూర్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. స్వైన్ ఫ్లూ సోకడంతో గత వారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోనమ్ చేరిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తో కలసి నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయ' షూటింగ్ సమయంలో సోనమ్ కపూర్ అస్వస్థతకు గురయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా సోనమ్ ట్వీట్ కూడా చేసింది. "స్వైన్ ఫ్లూకి చికిత్స తీసుకున్న నేను పూర్తిగా కోలుకున్నా. మా ఇంటికి తిరిగి వెళుతున్నా" అంటూ ఆనందం వ్యక్తం చేసింది.