: డివిలియర్స్ ఒంటరి పోరు... ఎవరైనా తోడు నిలవకుంటే ఓటమే!


పాకిస్థాన్ పై అంతగా కష్టతరం కాని 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ ఒంటరి పోరు చేస్తున్నాడు. అతనికి కనీసం ఒక్కరైనా తోడు నిలవలేకపోయారు. దీంతో 30 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి దక్షిణాఫ్రికా జట్టు ఓటమి ముంగిట నిలిచింది. చాలినన్ని ఓవర్లు ఉన్నప్పటికీ, నిలబడి ఆడే ఆటగాళ్లు కరవయ్యారు. డివిలియర్స్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ, 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో అర్థ సెంచరీని పూర్తి చేసుకుని జట్టును గెలిపించే బాధ్యతను భుజాలపై మోస్తున్నాడు.

  • Loading...

More Telugu News