: జగన్ కు పార్టీయే లేదు... ఇంకేం చేరతాం?: జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్య


జగన్ పార్టీలో చేరాలని అనుకుంటే తాను ఎప్పుడో చేరివుండే వాడినని తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేటి ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జగన్ కు పార్టీయే లేదని, ఇంక ఆయన పార్టీలో చేరడం అనే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుందని అన్నారు. ఖాళీ అవుతున్న ఆ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేయాల్సినంత ఒత్తిడి చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఆ హోదా వస్తుందని తాను నమ్మడం లేదని తెలిపారు. రాజధాని కోసం కనీసం 50 వేల ఎకరాలు కావాలని, అయితే, పంట భూములకు మినహాయింపు ఇస్తే మంచిదని వివరించారు.

  • Loading...

More Telugu News