: సత్తా చాటిన ఐర్లాండ్... జింబాబ్వే విజయలక్ష్యం 332
హోబర్ట్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్లను ఐర్లాండ్ ఆటగాళ్లు ఓ ఆట ఆడుకున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోర్ చేశారు. జాయ్ సీ 103 బంతుల్లో 112 పరుగులు చేయగా, బాల్ బిర్నీ 79 బంతుల్లో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. టాప్ ఆర్డర్ లో ఏడుగురు బ్యాట్స్ మెన్స్ రెండంకెల స్కోర్ చేశారు. జింబాబ్వే బౌలర్లలో టీఎల్ చతారా, విలియమ్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. మరికాసేపట్లో జింబాబ్వే జట్టు 332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనుంది.