: అక్కడ ఖూనీ కాని ప్రజాస్వామ్యం... ఇక్కడెలా ఖూనీ అవుతుంది?: టీడీపీపై జూపల్లి ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో నేడు జరిగిన ఘర్షణకు సంబంధించి టీఆర్ఎస్ నేత, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పంథాలో టీడీపీపై మాటల దాడి చేశారు. "టీడీపీ నేతలను మేం చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నామని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఏపీలో వైసీపీ టికెట్లపై గెలిచిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, జూపూడి ప్రభాకరరావులను టీడీపీ లాగేసుకుంది. మరి అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదా? దానికి టీడీపీ కారణం కాదా? అయినా ఏపీలో ఖూనీ కాని ప్రజాస్వామ్యం, తెలంగాణలో ఎలా ఖూనీ అవుతుంది?" అని ఆయన టీడీపీ నేతల ఆరోపణలపై విరుచుకుపడ్డారు.