: విపక్ష సభ్యుల వైఖరిని తెలంగాణ సమాజం అవమానంగా భావిస్తోంది: కర్నె ప్రభాకర్
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యుల వ్యవహారశైలిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని ఆరోపించారు. సభలో వారి వైఖరిని చూసి తెలంగాణ సమాజం అవమానంగా భావిస్తోందని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం మంచి పద్ధతేనా? అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, జూపూడి ప్రభాకర్, రుద్రరాజు పద్మరాజు తదితరులను టీడీపీలో చేర్చుకున్నారని... అదే రీతిలో ఇక్కడ టీడీపీ వారిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటే తప్పెలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసమే అందరూ టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. చివరకు జాతీయగీతాన్ని కూడా అవమానించారని మండిపడ్డారు.