: తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభం... టీడీపీ నుంచి కేవలం ఒక్కరికే అనుమతి
తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో టీఆర్ఎస్ నేతల దాడితో ఆందోళన పరంపర కొనసాగిస్తున్న టీటీడీపీ నేతలు సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలోనూ తమ నిరసన గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అధికార పక్షం, సమావేశంలో పాల్గొనే టీడీపీ సభ్యుల సంఖ్యపై పరిమితి విధించింది. కేవలం ఒక్కరంటే ఒక్కరే బీఏసీ సమావేశానికి రావాలని స్పీకర్ చాంబర్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఒక్కరే సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన బీఏసీ సమావేశంలో ఏం జరుగుతుందా? అని టీటీడీపీ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.