: స్పీకర్ చాంబర్ లో నేలపై కూర్చుని టీ టీడీపీ నేతల నిరసన... జానారెడ్డితో ఎర్రబెల్లి, రేవంత్ భేటీ!
అసెంబ్లీలో టీఆర్ఎస్ నేతల దాడిని టీటీడీపీ సీరియస్ గా పరిగణించింది. దాడికి పాల్పడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసిన ఆ పార్టీ నేతలు, నేరుగా స్పీకర్ చాంబర్ కు వెళ్లారు. తమపై దాడికి దిగిన టీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ సందర్భంగా వారు స్పీకర్ చాంబర్ లో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఘటనపై టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిని కలిశారు. అధికార పక్షం వైఖరిపై తమ పోరాటానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా జానారెడ్డిని వారు కోరారు.