: తెలంగాణ అసెంబ్లీలో బిగ్ ఫైట్... తోసేసుకున్న టీఆర్ఎస్, టీ టీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజునే యుద్ధ వాతావరణం నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలేవని ప్రశ్నించిన టీ టీడీపీ ఎమ్మెల్యేలు, సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగం సాగుతుండగానే ప్రభుత్వం, గవర్నర్ లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సీట్లలో నుంచి లేచిన టీఆర్ఎస్ సభ్యులు టీ టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుంది. టీ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, కృష్ణారావులను టీఆర్ఎస్ నేతలు తోసేశారు. దీంతో వారిద్దరూ పడిపోయారు. ఇదే సమయంలో టీ టీడీపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. తోపులాట సందర్భంగా ఇరువర్గాల మధ్య దూషణల పర్వం కూడా కొనసాగింది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నా పట్టించుకోని సభ్యులు సభలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం గమనార్హం.