: 222 పరుగులకు పాక్ ఆలౌట్... డక్ వర్త్ నిబంధనల ప్రకారం, దక్షిణాఫ్రికా టార్గెట్ 232


వరుణుడు పలుమార్లు ఆటంకం కల్పించిన దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో 46.4 ఓవర్లకు 222 పరుగులు చేసి పాకిస్థాన్ ఆలౌట్ అయింది. డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని 47 ఓవర్లకు 232 పరుగులుగా నిర్ధారించారు. మరికాసేపట్లో దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగనుంది. పాక్ జట్టులో సర్ఫరాజ్ 49, షెహజాద్ 19, యూనిస్ ఖాన్ 37, మిస్బా 56, మక్సూద్ 8, అక్మల్ 13, అఫ్రిది 22, రియాజ్ 0, సొహాయిల్ 3, రాహత్ అలీ 1, ఇర్ఫాన్ 1 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 3, అబాట్, మార్కెల్ చెరో 2, తాహిర్, డివిలియర్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

  • Loading...

More Telugu News