: రెడ్లకు అన్యాయం జరుగుతోంది... కొత్త పార్టీ పెడదామని రేవంత్ ప్రతిపాదించారు: కోమటిరెడ్డి


కొత్త పార్టీ పెడతానన్న తన వ్యాఖ్యలను మాజీ మంత్రి, టీకాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఖండించారు. మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేత రేవంత్ రెడ్డితో తాను మాట్లాడుతున్నప్పుడు పలు అంశాల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఈ చర్చ సందర్భంలో, కొత్త పార్టీ పెడతానని తాను చెప్పలేదని... పార్టీ పెడదామని రేవంత్ రెడ్డే ప్రతిపాదించారని వెల్లడించారు. టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అధ్యక్షతన పార్టీ ఏర్పాటు చేద్దామని సూచించారని చెప్పారు. కోదండరామ్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్న సంగతి తెలిసిందే. 'తెలంగాణ రెడ్డి సమితి' పేరుతో పార్టీ పెడితే బాగుంటుందని సరదాగా మాట్లాడుకున్నట్టు తెలిపారు. పార్టీ నాయకత్వాన్ని తాను విమర్శించదలుచుకోలేదని... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని తెలిపారు.

  • Loading...

More Telugu News