: ఎఫ్ బీఐ అరెస్ట్ చేయకుంటే ఒబామా తలను పేల్చేవాడిని: ఐఎస్ అనుమానిత ఉగ్రవాది


గత జనవరిలో ఎఫ్ బీఐ అధికారులు తనను అరెస్ట్ చేయకుంటే, అమెరికా రాజధానిపై దాడి చేసి, అధ్యక్షుడు ఒబామా తలకు తుపాకీని గురిపెట్టి, ట్రిగ్గర్ నొక్కేవాడినని ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాది క్రిస్టొఫర్ కార్నెల్ (20) చెప్పాడు. సిన్సినాటీలోని ఫాక్స్ 19 టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్నెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలోని ఇజ్రాయిల్ ఎంబసీపై దాడి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టు నిందితుడు అంగీకరించాడు. సెనేట్ పై, ప్రజాప్రతినిధులపై సాధ్యమైనన్ని ఎక్కువ బుల్లెట్లు కురిపించడమే తన లక్ష్యమని చెప్పాడు. పైప్ బాంబులను ఎలా తయారు చేయాలో కార్నెల్ నేర్చుకున్నాడని, ఒక తుపాకిని, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేశాడని ఎఫ్ బీఐ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News